నిలువ నీడ లేని పేదల గుడిసెలను రెవెన్యూ, పోలీస్ అధికారులు బలవంతంగా తొలగిస్తుంటే, సంపన్నులు, అధికారులు, రాజకీయ నాయకులు ఆక్రమించిన ఎన్నెస్పీ స్థలాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ ప్రశ్నించారు. ఖమ్మంలోని ఎన్నెస్పీ స్థలాల్లో జరుగుతున్న యథేచ్ఛా నిర్మాణాలను సీపీఐ బృందం పరిశీలించింది. ఆక్రమణదారుల్లో అధికారులు, ఉద్యోగ విరమణ చేసిన అధికారులు, రాజకీయ నాయకులు ఉన్నారని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.