ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో పిండిప్రోలులోని ఓ వైన్ షాప్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలెపొంగు కృష్ణ అనే క్యాషియర్‌ను, తనకు నచ్చిన రాయల్ స్ట్రాంగ్ బ్రాండ్ మద్యం ఇవ్వాలని ఐదుగురు యువకులు అడిగారు. అది అందుబాటులో లేదని చెప్పడంతో ఆగ్రహించిన యువకులు క్యాషియర్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.