ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం నూతన డీసీసీ అధ్యక్షుడిగా నూతి సత్యనారాయణ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, కార్యకర్తలందరికీ భరోసా ఇస్తూ తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నామని తెలిపారు. నూతన అధ్యక్షుడు పార్టీకి అట్టిపెట్టుకుని ఉన్న నాయకులు, కార్యకర్తలందరికీ సమ ప్రాధాన్యత ఇచ్చి సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.