ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వర్షాకాలం ప్రారంభం కాకముందే పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నగర సుందరీకరణ పనులు చేపట్టాలని, మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్ల విస్తరణను పూర్తి స్థాయిలో అమలు చేయాలని సూచించారు. ప్రజల ఆమోదం ఉన్న ప్రాంతాల్లోనే మాస్టర్ ప్లాన్ ప్రకారం నగర అభివృద్ధి, రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు.