గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడం తన రాజకీయ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం రఘునాథపాలెంలో జరిగిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. పనిచేసే కార్యకర్తలకు పార్టీ పదవుల్లో పెద్దపీట వేస్తామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని, ప్రజాభిమానం ఉంటే పదవులు అవే దక్కుతాయని పేర్కొన్నారు.