బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు శుక్రవారం ఖమ్మంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, సొంత ప్రయోజనాల కోసం పార్టీలు మారిన నాయకులకు బీఆర్ఎస్ పార్టీని లేదా తమ నాయకులను విమర్శించే నైతికత లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖమ్మంలో చెప్పుకోదగిన అభివృద్ధి జరగలేదని, వీధిలైట్లు, చెత్త నిర్వహణలోనూ విఫలమైందని ఆయన తెలిపారు.