ఖమ్మం: పెండ్లి కావడం లేదని యువకుడు ఆత్మహత్య

2చూసినవారు
ఖమ్మం: పెండ్లి కావడం లేదని యువకుడు ఆత్మహత్య
పెళ్లి కావడం లేదన్న మనస్తాపంతో వికలాంగుడైన 23 ఏళ్ల వినయ్ అనే యువకుడు సోమవారం తిరుమలాయపాలెం మండలంలోని కేశ్వపురం గ్రామంలో ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయం చేసుకునే దొడ్డ రామన్న, జయమ్మ దంపతుల కుమారుడైన వినయ్, మద్యానికి బానిసై, మేకపిల్ల వదిలి, గేదెలను మేతకు తోలుకెళ్లి, ఓ రైతు వ్యవసాయ క్షేత్రంలో ప్లాస్టిక్ వైర్ తో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు ఎస్సై కూచిపూడి జగదీశ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్