తల్లాడలో సోమవారం, మాడుగుల గోపి అనే యువకుడు తన భార్యను కాపురానికి పంపించాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీవో ఆఫీస్ పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బ్లేడుతో చేతిపై కోసుకున్నాడు. మూడు రోజుల క్రితం భార్యాభర్తల గొడవలో భార్యపై దాడి చేయడంతో ఆమె పుట్టింటికి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తనకు న్యాయం చేయలేదని, అందుకే ఈ చర్యకు పాల్పడ్డానని గోపి తెలిపాడు. తహసీల్దార్, ఎంపీడీవో, పోలీసులు, స్థానికుల జోక్యంతో, భార్య రాకతో వివాదం సద్దుమణిగింది.