ఖమ్మం: వరి పొలంలో విద్యుత్ షాక్ తో యువకుడి మృతి

0చూసినవారు
ఖమ్మం: వరి పొలంలో విద్యుత్ షాక్ తో యువకుడి మృతి
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తాళ్ళపెంట గ్రామ శివారులోని పంటపొలాల్లో విద్యుత్ షాక్ తో పద్దం శివకృష్ణ అనే యువకుడు మృతి చెందాడు. స్నేహితులతో కలిసి చేపలు పట్టి తిరిగి వస్తుండగా, బాజిన్ని పిచ్చయ్య అనే రైతు తన వరి పొలాన్ని అడవి పందుల నుండి రక్షించుకోవడానికి ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి శివకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. స్నేహితులు అతడిని పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు మృతిని నిర్ధారించారు. పోలీసులు రైతు పిచ్చయ్యను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్