ఖమ్మం: విద్యుదాఘాతంతో యువకుడు మృతి

73చూసినవారు
ఖమ్మం: విద్యుదాఘాతంతో యువకుడు మృతి
ఖమ్మం నగరంలోని టూటౌన్ పరిధిలో విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉండే ఉపేందర్ (28) తన ఇంట్లో కుట్టుమిషన్ కు విద్యుత్ కనెక్షన్ ఇచ్చే క్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. అపస్మారకస్థితికి చేరుకున్న అతడిని బంధువులు జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తమకు ఇంకా ఫిర్యాదు రాలేదని టూటౌన్ పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్