తల్లిదండ్రులపై ప్రేమను వినూత్నంగా చాటుకున్న ఖమ్మం యువకుడు

1129చూసినవారు
తల్లిదండ్రులపై ప్రేమను వినూత్నంగా చాటుకున్న ఖమ్మం యువకుడు
ఖమ్మం నగరానికి చెందిన పేరబోయిన శ్రీకాంత్ తన తల్లిదండ్రులపై ఉన్న అపారమైన ప్రేమను వినూత్నంగా చాటుకున్నారు. తన రెండు చేతులపై తండ్రి పేరబోయిన మోహన్‌రావు ఫోటోను ‘కామ్రేడ్’గా, తల్లి ఫోటోను ‘అమ్మ’గా టాటూలుగా వేయించుకున్నారు. తల్లిదండ్రులపై ప్రేమతో పాటు కమ్యూనిస్టు పార్టీపై తనకున్న అభిమానాన్ని కూడా ఈ టాటూల ద్వారా వ్యక్తం చేశారు. మోహన్‌రావు భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జిల్లా నాయకుడిగా, ఏఐటీయూసీ యూనియన్ జిల్లా నాయకుడిగా ప్రజా, కార్మిక సమస్యలపై పనిచేస్తున్నారు. తండ్రిని కామ్రేడ్‌గా, తల్లిని అమ్మగా గుండెల్లో నిలుపుకున్న శ్రీకాంత్ అభిమానం స్థానికంగా ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది.

సంబంధిత పోస్ట్