ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలులో ఓ వైన్ షాపులో ఐదుగురు యువకులు తమకు కావాల్సిన మద్యం బ్రాండ్ దొరక్కపోవడంతో క్యాషియర్ పోలెపొంగు కృష్ణపై దాడి చేశారు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డయింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.