పాపటపల్లి గ్రామంలో, దివంగత కొనకంచి వెంకటప్పయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు రవికుమార్, కుమార్తె రమాదేవి గ్రామ పంచాయతీ కార్యాలయానికి కంప్యూటర్, ప్రింటింగ్, జిరాక్స్ మిషన్లను సుమారు 36,000 రూపాయల విలువైన విరాళంగా అందించారు. ఈ సేవను గ్రామ పంచాయతీ ప్రశంసించింది. సమాజ అభివృద్ధికి దానధర్మాలు అవసరమని, డబ్బు సంపాదించడంతో పాటు ఇతరులకు సహాయం చేయాలని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రెటరీ గోపి, నగేష్, వెంకట్ నారాయణ, వెంకటేశ్వర్లు, రామచంద్రయ్య, రామయ్య, సైదులు, నాగళ్ళ భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.