కూసుమంచి: వాసవి క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

50చూసినవారు
కూసుమంచి: వాసవి క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ
వాసవి క్లబ్ నాయకన్ గూడెం కపుల్స్ ఆధ్వర్యంలో గురువారం నాయకన్ గూడెం గ్రామంలోని చందన పాఠశాలలో 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆఫీసర్ బూర్లే వేలాద్రి నరసింహ రావు మాట్లాడుతూ.. పేద విద్యార్థుల చదువులకు వాసవి క్లబ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని తెలిపారు. పాఠశాల ప్రిన్సిపల్ నాగార్జున, ఉపాధ్యాయులు, విద్యార్థులు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్