కూసుమంచి మండలం నాయికన్ గూడెం వద్ద సోమవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాన్వాయ్‌ను ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వస్తుండగా అధికారులు వాహనాలను నిలిపి తనిఖీ చేయగా మంత్రి సహకరించారు. పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు, డబ్బు, మద్యం తరలింపును అడ్డుకునేందుకు పోలీసులు ఈ ప్రత్యేక వాహన తనిఖీలు చేపడుతున్నారు.