ఖమ్మం జిల్లా భద్రాచలం కార్మిక శాఖ కార్యాలయంలో ఉన్నతాధికారి అందుబాటులో లేకపోవడం, జూనియర్ అసిస్టెంట్‌కు కనీస పని తెలియకపోవడం వంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆన్‌లైన్ ఆమోదాలు ఇవ్వాల్సిన అధికారిక లాగిన్ ఐడీలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని, ప్రభుత్వ రహస్యాలు, అధికారిక వివరాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారం జిల్లా అధికారుల అండదండలతోనే నడుస్తోందని సమాచారం.