తూతక్క లింగన్నపేటలో పారిశుద్ధ్య లోపం, గ్రామస్థుల ఆవేదన

991చూసినవారు
తూతక్క లింగన్నపేటలో పారిశుద్ధ్య లోపం, గ్రామస్థుల ఆవేదన
ఏన్కూర్ మండలం తూతక్క లింగన్నపేట గ్రామంలో పారిశుద్ధ్య లోపం తీవ్రంగా ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని పేర్కొంటూ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని మంగళవారం కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్