సత్తుపల్లి మండలం గుడిపాడులో శనివారం జరిగిన సమావేశంలో POW రాష్ట్ర మాజీ కార్యదర్శి చండ్ర అరుణ మాట్లాడుతూ, గిరిజన మహిళలపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని అన్నారు. గుడిపాడు గిరిజనులు 25 ఏళ్లుగా పోడు వ్యవసాయం చేస్తున్నా, వారికి పూర్తి స్థాయిలో పట్టాలివ్వకుండా అటవీ అధికారులు మహిళలపై దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని, వారిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.