ఖమ్మం జిల్లా బోనకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అంతోటి తిరుపతిరావు, ప్రిన్సిపాల్ లింగంనేని నళినిశ్రీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలోభూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమని ప్రిన్సిపాల్ కొనియాడారు. అన్యాయాన్ని ప్రశ్నించడం, హక్కులను తెలుసుకోవడం, సమానత్వం, ఆత్మగౌరవం కోసం ఆమె జీవితం నేర్పిన పాఠాలని, యువత ఆమె పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.