వరంగల్-ఖమ్మం రహదారిపై లారీలు ఢీ.. స్తంభించిన ట్రాఫిక్

3చూసినవారు
వరంగల్-ఖమ్మం రహదారిపై లారీలు ఢీ.. స్తంభించిన ట్రాఫిక్
వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై సోమవారం ఉదయం దమ్మాయిగూడెం గ్రామ సమీపంలో రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొని ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో లారీలకు భారీ నష్టం వాటిల్లింది. ఒక లారీలో ఉన్న బొప్పాయి కాయలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడటంతో, స్థానికులు వాటిని తీసుకెళ్లారు. ప్రమాదం కారణంగా రోడ్డుకు ఇరువైపులా లారీలు అడ్డంగా నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.