బోనకల్-జగ్గయ్యపేట రహదారిపై లారీ బోల్తా

1చూసినవారు
బోనకల్-జగ్గయ్యపేట రహదారిపై లారీ బోల్తా
బోనకల్ మండల పరిధిలోని బోనకల్-జగ్గయ్యపేట ప్రధాన రహదారిపై బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. కొత్తగూడెం నుంచి జగ్గయ్యపేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో రహదారికి ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో లారీని తొలగించారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్