ఖమ్మం నగరంలోని 44వ డివిజన్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మాచర్ల తిరుమలరావు శనివారం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మైనారిటీ, మహిళా నాయకులు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తుమ్మల యుగంధర్, నగర
కాంగ్రెస్ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి, గుడిపూడి జగదీష్ తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, డివిజన్‌లో ప్రతి ఒక్కరినీ కలుపుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం దీపక్ చౌదరిని కలిసి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సన్మానించారు.