హైదరాబాద్‌లో పెయింటింగ్ పని చేసుకుంటున్న ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా లంకూరుకు చెందిన పొట్నూరి అరుణ్ కుమార్, రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా మధిర - తొండల గోపవరం రైల్వేస్టేషన్ల మధ్య రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. ఈ ఘటనపై జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.