ఏన్కూరు మండల కేంద్రంలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశి విశ్వేశ్వర ఆలయం నందు కార్తీక సోమవారం
పురస్కరించుకొని మహా జ్యోతిర్లింగార్చన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు మేడూరు కిరణాచార్యులు, మేడూరు కిషోర్ ఆచార్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా శివాలయం మహిళా భక్తులు పోటెత్తారు. మండలంలోని వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు మహా జ్యోతిర్లింగార్చన కార్యక్రమాన్ని కన్నుల పండుగ చూడడం జరిగింది. స్వామివారి దర్శనం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. శివయ్య నామస్మరణతో ఆలయం మొత్తం మారుమోగింది. ఆలయ ధర్మకర్తల చైర్మన్ వేముల రమేష్ బాబు, ఆలయ నిర్మాణ దాత గోరంట్ల శ్రీనివాస్ చౌదరి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.