జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సత్యం, అహింస, ధర్మాలను ఆయుధాలుగా మలుచుకొని, మహాత్మాగాంధీ అఖండ భారతావనికి స్వాతంత్ర్యం సాధించడానికి ఎనలేని కృషి చేసిన మహనీయుడని కలెక్టర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, డీఎంహెచ్ఓ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.