ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతం చేయండి

11చూసినవారు
ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతం చేయండి
ఖమ్మం జిల్లాలో ఈనెల 7న శనివారం మంచికంటి ఫంక్షన్ హాల్‌లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సీపీఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్ తెలిపారు. బుధవారం సుందరయ్య భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ త పదేళ్లుగా బీవీకే ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఉదయం 6 నుండి 11 గంటల వరకు బీపీ, షుగర్, పక్షవాతం, కంటి, చెవి, ముక్కు, గొంతు సమస్యలకు ఉచిత పరీక్షలు, మందులు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్