ఏన్కూర్ ఎస్సై సంధ్య బాలికల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో చిన్నారి బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, బిస్కెట్లు చూపించి అఘాయిత్యాలకు పాల్పడటం వంటి ఘటనలు జరుగుతున్నాయని, పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయని ఆమె తెలిపారు. ఇటీవల ఓ గ్రామంలో 65 ఏళ్ల వ్యక్తి బాలికపై అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేశామని, గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై సంధ్య కోరారు.