అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

24చూసినవారు
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ఆదివారం ఒక యువ కౌలు రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. శంకరగిరి తండాకు చెందిన డిగ్రీ పట్టభద్రుడు, 30 ఏళ్ల బానోత్‌ వీరన్న, మాదాపురంలో 15 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి, మిర్చి పంటలు వేశారు. చీడపీడల వల్ల పంట నష్టపోయి సుమారు రూ.10 లక్షల అప్పుల్లో కూరుకుపోయారు. అప్పులు తీర్చే మార్గం లేక, ప్రభుత్వం కౌలు రైతులను ఆదుకోవాలని కోరుతూ సెల్ఫీ వీడియో తీస్తూ పురుగుమందు తాగారు. స్నేహితులు వెంటనే ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.

సంబంధిత పోస్ట్