ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం

4చూసినవారు
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం
తల్లాడ మండల పరిధిలోని వెంకటగిరి క్రాస్ రోడ్ సమీపంలో సోమవారం ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో మేడ వెంకయ్య అనే వ్యక్తికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. జగన్నాధపురం గ్రామానికి చెందిన మేడ వెంకయ్య తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, సత్తుపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. స్థానికులు అందించిన సమాచారం ప్రకారం, గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో 108 అంబులెన్స్ ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్