ఎన్నికల కోడ్ ముగిసినా తొలగని ముసుగులు

7చూసినవారు
ఎన్నికల కోడ్ ముగిసినా తొలగని ముసుగులు
కారేపల్లి మండల పరిధిలోని గ్రామ పంచాయతీల్లో రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, పార్టీ గద్దెలు కనిపించకుండా గ్రీన్ మ్యాట్లు కట్టారు. గత నెలలో ఎన్నికల కోడ్ పడడంతో ముసుగులు చేశారు. కానీ ఎన్నికల కోడ్ ఎత్తివేసి రోజులు గడుస్తున్నా వాటికి వేసిన ముసుగులు తీయకపోవడంతో ఎన్నికల కోడ్ కొనసాగుతుందని కొంతమంది విడ్డూరంగా చూస్తున్నారు. అధికారులు మాత్రం అటు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. నాయకుల, పార్టీ గద్దెలకు మ్యాట్లు తీయకపోవడం ఏంటని పలు రాజకీయ నాయకులు ప్రశ్నిస్తున్నారు. దీంతో మండలం లో అధికారుల పనితీరు పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.