
అనంతగిరి కొండల్లో రీల్స్.. క్షమాపణలు చెప్పిన ఉప్పల్ బాలు
TG: వికారాబాద్ అనంతగిరి కొండల్లో రన్నింగ్ థార్ కారుపై ప్రమాదకరంగా రీల్స్ చేసిన ఉప్పల్ బాలు వివాదంలో చిక్కుకున్నారు. ప్రశాంతమైన అటవీ, పుణ్యక్షేత్ర వాతావరణంలో రోడ్డుపై ఆగి ఉన్న కారుపైకెక్కి రీల్స్ చేయడం, బైకర్‌కు అడ్డుగా వెళ్లడం వంటివి వీడియోల్లో కనిపించాయి. ఈ వీడియోలు వైరల్ కావడంతో స్థానికులు, భక్తులు, నెటిజన్లు మండిపడ్డారు. అటవీ శాఖ అధికారులు సీరియస్ అవ్వడంతో, ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదని చెప్తూ, బాలు క్షమాపణలు కోరాడు.




