ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాధపురం-మత్కేపల్లి క్రాస్రోడ్ వద్ద జరగనున్న రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. సభా ప్రాంగణం, వేదిక, పార్కింగ్, ఇతర ఏర్పాట్లపై అధికారులతో చర్చించి, ముఖ్యమంత్రి సభ విజయవంతం కావడానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. అధిక సంఖ్యలో ప్రజలు హాజరై సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.