
పారిస్‌లో మార్మోగిన ‘వారణాసి’ గ్లింప్స్ (వీడియో)
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తన తదుపరి చిత్రం 'వారణాసి'తో పాటు 'బాహుబలి: ది ఎటర్నల్ వార్ పార్ట్-1'కు సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్‌ను ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని 'లా సినెమాటెక్ ఫ్రాంకైస్' థియేటర్లో జూన్ 26న ప్రదర్శించారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. స్క్రీన్‌పై మహేశ్ బాబు ఎంట్రీ ఇవ్వగానే ఫ్రెంచ్ ప్రేక్షకులు చప్పట్లు, ఈలలతో థియేటర్‌ను మార్మోగించారు. ఈ అరుదైన క్షణాలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.




