ఖమ్మం ఖిల్లా రోప్ వే పనుల పురోగతిపై మంత్రి తుమ్మల సమీక్ష

1చూసినవారు
ఖమ్మం ఖిల్లా రోప్ వే పనుల పురోగతిపై మంత్రి తుమ్మల సమీక్ష
ఖమ్మం ఖిల్లా రోప్‌వే నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఖమ్మం నగరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోందని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో రోప్‌వే నిర్మాణ బాధ్యతలు చేపట్టిన రోప్‌వే సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సీఈఓ రంజిత్ పక్రాసీతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతి, పూర్తైన దశలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.