ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


దంపతులు ఆత్మహత్య.. వెలుగులోకి కీలక నిజాలు
Jun 30, 2026, 05:06 IST/

దంపతులు ఆత్మహత్య.. వెలుగులోకి కీలక నిజాలు

Jun 30, 2026, 05:06 IST
TG: రంగారెడ్డి జిల్లా జన్వాడలో బలసాయి, పద్మ దంపతుల ఆత్మహత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. తమ ఇంట్లో నిధి ఉందని ఓ సాధువు చెప్పాడని, అది తీయడానికి రూ.10 లక్షలు కావాలని అత్తమామలు, తోడల్లుడు కలిసి బలసాయిని నమ్మించారు. దీంతో వడ్డీలకు రూ.10 లక్షలు అప్పు చేసి వారికిచ్చినట్లు సమాచారం. తవ్వకాలు జరపగా నిధి దొరకకపోవడంతో వారు చేతులెత్తేశారు. అయితే అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి పెరగడంతో మనస్తాపం చెంది బలసాయి, పద్మ ఆత్మహత్య చేసుకున్నారు. తమ చావుకు అత్తమామలు, తోడల్లుడే కారణమని బలసాయి ఫోన్లో మెసేజ్ చూసి పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.