ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రేపు ఉదయం 10:30 గంటలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాబోయే వానాకాలం (ఖరీఫ్) సాగు కార్యాచరణ ప్రణాళిక, సాగునీటి విడుదల, పౌరసరఫరాల ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. అలాగే, ఖమ్మం నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ శాఖల అభివృద్ధి పనుల ప్రగతిపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.