బాపూజీ జయంతి కార్యక్రమాలకు, మంత్రులు హాజరై గౌరవం ఇవ్వాలి.. నాగరాజు

1చూసినవారు
బాపూజీ జయంతి కార్యక్రమాలకు, మంత్రులు హాజరై గౌరవం ఇవ్వాలి.. నాగరాజు
ఖమ్మం జిల్లాలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ మాజీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు ఆదివారం మాట్లాడుతూ తెలంగాణ వైతాళికుల జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో మంత్రులు స్వయంగా పాల్గొని గౌరవం ఇవ్వాలని కోరారు. లకారం ట్యాంక్‌బండ్ వద్ద బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు హాజరై గౌరవం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్