ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేటలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాలను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, భోజన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. సాయంత్రం అందించే అల్పాహారం నాణ్యత, తయారీ విధానంపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వంటగదిని పరిశీలించి, కూరగాయలు, ఆహార పదార్థాల నాణ్యతను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్శనలో విద్యార్థుల సంక్షేమంపై ఆయన దృష్టి సారించారు.