అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందించేందుకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ చొరవ తీసుకున్నారు. ఈ మేరకు 156 మంది బాధితుల మెడికల్ బిల్లులను హైదరాబాద్‌లోని సచివాలయంలో సంబంధిత అధికారులకు అందజేశారు. అర్హులైన ప్రతి బాధితుడికి ప్రభుత్వ సాయం అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.