రైతు ఆశీర్వాద సభ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన ఎమ్మెల్యే

8చూసినవారు
రైతు ఆశీర్వాద సభ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన ఎమ్మెల్యే
హైదరాబాద్ శిల్పకళా వేదికలో, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించగా, ఖమ్మం జిల్లాలో స్థానిక ఎమ్మెల్యే ప్రత్యక్ష ప్రసారాన్ని మంగళవారం వీక్షించారు.