పోలీస్ ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అవగాహన, పరీక్షా నైపుణ్యాలు పెంపొందించేందుకు నవంబర్ 6న ఖమ్మం జిల్లా కేంద్రంలో AIYF ఆధ్వర్యంలో మోడల్ టెస్ట్ నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి చింతల రమేష్, నగర కార్యదర్శి కృష్ణ ప్రసాద్ (కేపీ) తెలిపారు. పోలీస్ ఉద్యోగాల ఆశావహులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పెద్ద సంఖ్యలో పాల్గొని మోడల్ టెస్ట్‌ను విజయవంతం చేయాలని వారు కోరారు. అభ్యర్థుల్లో పరీక్షల పట్ల ఆత్మవిశ్వాసం పెంపొందించడమే ఈ పరీక్ష ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.