తల్లి, కుమార్తెల హత్య కేసు: నిందితుడికి జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా

7చూసినవారు
తల్లి, కుమార్తెల హత్య కేసు: నిందితుడికి జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా
తల్లాడ మండలం గోపాలపేట గ్రామానికి చెందిన పిట్టల వెంకటేశ్వర్లు, మద్యానికి బానిసై ఆస్తిపై కన్నేసి, అడ్డుగా ఉన్న తన తల్లి పిట్టల పిచ్చమ్మ, కుమార్తెలు నీరజ, ఝాన్సీలను ఆహారంలో విషం కలిపి, అనంతరం నోట్లో గుడ్డలు కుక్కి రోకలిబండతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో నిందితుడికి సత్తుపల్లి ఏ.డి.జె. కోర్టు శుక్రవారం జీవితకాల కఠిన కారాగార శిక్షతో పాటు 10 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. గత సంవత్సరం జరిగిన ఈ ఘటనపై అప్పటి సీఐ నునవత్ సాగర్, ఏఎస్ఐ కెవియర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, అనంతరం ఎస్సై ఎన్. వెంకటకృష్ణ, కోర్ట్ కానిస్టేబుల్ బి. హరిదాస్ కేసును కోర్టులో నడిపించారు.

సంబంధిత పోస్ట్