మోటార్ వైర్ల దొంగ పట్టివేత.. స్థానికుల దేహశుద్ధి

1చూసినవారు
మోటార్ వైర్ల దొంగ పట్టివేత.. స్థానికుల దేహశుద్ధి
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గుర్రాలపాడులో మోటార్ వైర్ల దొంగతనం కలకలం రేపింది. దొంగిలించిన మోటార్లలోని కాపర్ వైర్లను కాల్చి తీస్తుండగా స్థానికులు ఒక వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనాస్థలికి చేరుకుని దొంగను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మోటార్లు ఎక్కడి నుంచి దొంగిలించబడ్డాయి, ఈ ఘటనలో మరెవరైనా ఉన్నారా అనే కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. ఇటీవల కాలంలో ఇలాంటి దొంగతనాలు పెరగడంతో సోమవారం స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్