ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఎంపీ రేణుకాచౌదరి తన అనుచరులకు పదవులు ఇప్పించుకునేందుకు ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఆమెతో కలిసి పనిచేసిన మంత్రులు తుమ్మల, పొంగులేటి ఇటీవల ప్రకటించిన పదవుల భర్తీలో జరిగిన అన్యాయంపై గళమెత్తినా పార్టీ పట్టించుకోలేదని తెలిసింది. ఇప్పటికే భట్టితో సఖ్యత లేని రేణుక, తుమ్మల, పొంగులేటి వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. పార్టీ హైకమాండ్‌తో ఆమెకున్న పరిచయాల నేపథ్యంలో జిల్లా భవిష్యత్ రాజకీయ వ్యూహంపై ఆసక్తి నెలకొంది.