ఖమ్మంలో ఇటీవల దుర్ఘటనకు గురైన 12 ఏళ్ల బాలికను రాజ్యసభ ఎంపీ రేణుక చౌదరి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి బాలిక ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. బాలిక పరిస్థితి చూసి చలించిపోయిన రేణుక చౌదరి, నిందితుడికి కఠిన శిక్ష విధించాలని, బాధితురాలికి న్యాయం జరగాలని, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.