ఖమ్మంలోని త్రివేణి పాఠశాల ఎన్‌సీసీ కేడెట్లు భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ఘనంగా సెల్యూట్ చేసి అభినందనలు తెలిపారు. శనివారం పాఠశాల ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో విమానంలో అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు తీవ్ర గాయాలైనప్పటికీ, కెప్టెన్ స్మిత్ మచ్చర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడారని కేడెట్లు కొనియాడారు. ఆయన ధైర్యం, బాధ్యతాయుత ప్రవర్తన యువతకు స్ఫూర్తిదాయకమని పాఠశాల డైరెక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి అన్నారు.