ఖమ్మం జిల్లా
కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, సంజీవరెడ్డి భవన్ లో భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 62వ వర్ధంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత తొలి ప్రధానిగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.