బల్లేపల్లి 3వ డివిజన్‌లో ఎంఆర్‌పీఎస్–ఎంఎస్‌పీ నూతన కమిటీ ఎన్నిక

12చూసినవారు
బల్లేపల్లి 3వ డివిజన్‌లో ఎంఆర్‌పీఎస్–ఎంఎస్‌పీ నూతన కమిటీ ఎన్నిక
ఖమ్మం నగరం బల్లేపల్లి బస్తీ 3వ డివిజన్‌లో మంగళవారం ఎంఆర్‌పీఎస్–ఎంఎస్‌పీ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎంఆర్‌పీఎస్–ఎంఎస్‌పీ ఖమ్మం నగర ఇన్‌చార్జి తూరుగంటి రాము మాదిగ సమక్షంలో డివిజన్ అధ్యక్షుడిగా గాజుల రాము మాదిగ, ఎంఎస్‌పీ డివిజన్ అధ్యక్షుడిగా చాట్ల సాయి మాదిగ ఎన్నికయ్యారు.అక్టోబర్ 7న అమరావతిలో నిర్వహించనున్న ఎంఆర్‌పీఎస్–ఎంఎస్‌పీ నూతన మండల కమిటీల జాతీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. మాదిగలకు అండగా నిలిచి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్