త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో, మంగళవారం తల్లాడ మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ అకస్మికంగా తనిఖీ చేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలో మూడో విడత నామినేషన్లు ఈ నెల 4వ తేదీ నుంచి పకడ్బందీగా నిర్వహించాలని, నామినేషన్ పత్రాల సమర్పణ సమయంలో కుల ధృవీకరణ పత్రానికి బదులుగా గెజిటెడ్ డిక్లరేషన్ సమర్పించినా అంగీకరించాలని సూచించారు. సాయంత్రం 5 గంటలలోపు నామినేషన్ కేంద్రంలోకి వచ్చిన వారిని మాత్రమే అనుమతించాలని, నామినేషన్ కేంద్రాల్లోని హెల్ప్ డెస్క్, ఫ్లెక్సీలను పరిశీలించారు. ఈ తనిఖీలో డీఎల్పీఓ కల్లూరు, ఎంపీడీవో సురేష్, ఎమ్మార్వో కరుణాకర్, ఈవో కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.