ఆయిల్‌పామ్ సాగుతో అన్నదాతలకు లాభాలు.. మంత్రి తుమ్మల చొరవతో విస్తరణ

0చూసినవారు
ఆయిల్‌పామ్ సాగుతో అన్నదాతలకు లాభాలు.. మంత్రి తుమ్మల చొరవతో విస్తరణ
ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆయిల్‌పామ్ సాగుకు చిరునామాగా మారుతోంది. మంత్రి తుమ్మల చొరవతో అధికారులు నిర్వహిస్తున్న అవగాహన సదస్సులు సత్ఫలితాలనిస్తున్నాయి. ప్రభుత్వం రాయితీపై కేవలం ₹20లకే మొక్కలు అందజేస్తుండటంతో అన్నదాతలు ఈ సాగుపై మక్కువ చూపుతున్నారు. ఇప్పటికే జిల్లాలో సుమారు 15 వేల మంది రైతులు ఆయిల్‌పామ్ సాగు చేస్తూ లాభాల బాటలో పయనిస్తున్నారు. సంప్రదాయ పంటల కంటే అధిక ఆదాయం లభిస్తుండటంతో రైతులు ఈ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు.